తెలుగు టీవి సీరియల్స్ లలో స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతున్నాయి. అందులో బ్రహ్మముడి సీరియల్ టాప్-5 లో ఉంటుంది.
ఈ సీరియల్ లోని ప్రతీ పాత్ర అందరికి సుపరిచితమే. ముఖ్యంగా కావ్య పాత్ర.. కావ్య అలియాస్ దీపిక రంగరాజు.. బ్రహ్మముడి సీరియల్ లో తన నటనతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. రాజ్-కావ్యల జోడీ బుల్లితెరపై హిట్ జోడీగా నిలిచింది. ఇక వీరిద్దరి మధ్య సాగే సంభాషణలు ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ ఫైట్ లా అనిపిస్తాయి. ఇక బ్రహ్మముడి తాజా ఎపిసోడ్ లలో భాగంగా ధాన్యలక్ష్మి ఆస్తిని పంచివ్వమని అడగడంతో ఇంటి పెద్ద సీతారామయ్యకి గుండెపోటు రావడంతో.. అతడిని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించడం.. డాక్టర్స్ కోమాలోకి వెళ్ళాడని చెప్పడం అన్నీ జరిగిపోయాయి. ఇక రుద్రాణి వేసిన మాస్టర్ ప్లాన్ లో ధాన్యలక్ష్మి ప్రతీసారీ బలిపశువు అవుతుంది.
ఇక ధాన్యలక్ష్మి ఆస్తిని వాటాలు పంచి ఇవ్చమనడంతో సుభాష్ పంపిస్తాననడం హైలైట్ గా నిలిచింది. తీరా లాయర్ వచ్చి ఓ న్యూస్ చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఆస్తి మొత్తం కావ్య పేరు మీద పెద్దాయన ఎప్పుడో రాసిచ్చాడని లాయర్ చెప్పడంతో అందరు కంగుతిన్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో రాజ్ ఆఫీస్ లో ఉండగా కొంతమంది ఆఫీసర్స్ వచ్చి సీతారామయ్య ఒక కంపెనీకి షూరిటీ ఇచ్చాడని చెప్పడం.. దానికి ఒప్పుకోమని రాజ్ ని బలవంతం చేయడం ఉత్కంఠగా మారింది. అయితే ఆ షూరిటి ఇచ్చిన సీతారామయ్య ఫ్రెండ్ కొడుకే మన కొత్త విలన్. అతనే నందగోపాల్. ఇక అతని ఎంట్రీ మాములుగా లేదు. 'ఈగ' సినిమాలోని విలన్ 'కిచ్చ సుదీప్' లా అనిపిస్తోంది. ఇక అతని రాకతో బ్రహ్మముడి సీరియల్ మగ విలన్ దొరికేసాడనే ఫీలింగ్ వచ్చేసింది. ముందుముందు రాజ్ తో ఈ కొత్త విలన్ కి మధ్య మాటల యుద్ధం ఎలా ఉంటుందో చూడాలి మరి.